భారతదేశం గర్వించదగిన ప్రపంచస్థాయి మేధావి డా.బి.ఆర్. అంబేడ్కర్ అని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన దేశానికి చేసిన సేవలను ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. సమాజంలోని అంతరాలను తొలగించడానికి, ఆర్థిక అసమానతలను సరిచేయడానికి అవసరమైన మార్గాన్ని అంబేడ్కర్ నిర్దేశించారన్నారు. భారత పౌరులందరూ పవిత్ర మతగ్రంధంతో సమానంగా భావించే రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడిగా అందరికీ తెలిసిన అంబేడ్కర్, తన జీవితం, వ్యక్తిత్వం ద్వారా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు.
No comments:
Post a Comment