రిలయెన్స్ ఇన్ఫోకమ్ విడుదల చేసిన జియో మెసేజింగ్ యాప్ ఇప్పుడు వాట్సాప్‌కి పోటీగా నిలవనుందా? అవుననే సమాధానం వెలువడుతోంది. దేశీయ మార్కెట్ నుంచి వెలువడిన ప్రత్యామ్నాయ వేదికగా చూస్తున్న జనం ఇప్పుడు జియో పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నెలా 700 మిలియన్ల వినియోగదారులు వాట్సప్‌ని వాడుతుండడంతో, ఒకదశలో వాట్సాప్‌ని రీచ్ అవడం సాధ్యమా అనే సందేహం కలిగేది. మొదట్లో ప్రపంచ వ్యాప్తంగా ఎవరితోనైనా ఉచితంగా అనుసంధానం చేసేందుకు వాట్సాప్ ఏకైక యాప్ ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని జియో భర్తీ చేస్తూ ముందుకు వచ్చింది.
ఆండ్రాయిడ్, ఐఎస్‌ఓ డివైస్‌ల్లో పనిచేసేలా రూపొందించిన ఈ మొబైల్ అప్లిషన్ తక్కువ సమయంలోనే వినియోగదారుల మన్ననలు పొందింది. ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్‌లో 4. 5ప్లస్ రేటింగ్ సాధించడం విశేషం. వాట్సాప్‌తో పోల్చితే జియో అదనపు ఆప్షన్స్ ఉండడం విశేషం. మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్ కలిగి ఉండడం వల్ల భారతీయ వినియోగదారులు ఎక్కువగా ఇప్పుడు జియో వైపు ఆసక్తి చూపుతున్నారు.
Get app from Play Store:https://play.google.com/store/apps/details?id=com.jiochat.jiochatapp
Get app from IOS:https://itunes.apple.com/in/app/jio-chat/id981918884?ls=1&mt=8
For more information about Jio Chat, visit: http://www.jiochat.com
No comments:
Post a Comment