కళ్ళు బైర్లు కమ్మే నిజాలు..!

కళ్ళు బైర్లు కమ్మే నిజాలు..!


modi_with_black_money_list


మినిమమ్ గవర్నమెంట్.. మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఆ దిశగా అడుగులేస్తున్నారు. పీఎంగా పగ్గాలు చేపట్టిన వెంటనే తిమిరంతో సమరం మొదలుపెట్టారు. అక్రమ మార్గాల్లో డబ్బు దోచుకుని విదేశీ బ్యాంకుల్లో దాచిపెట్టిన నల్ల దొంగల పని పట్టే దిశగా తొలి అడుగు వేశారు. అవినీతిపరులకు షాకిస్తూ విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తవ్వి తీసేందుకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేశారు. బ్లాక్ మనీని వెలికి తీయడంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి అక్రమార్కుల గుండెల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఏళ్ల తరబడి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి వెళ్తున్న నల్లధనం వెలికితీత కార్యక్రమంపై మోడీ అండ్ టీమ్ యాక్షన్ కు దిగింది. భారత్ ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకు రావాల్సిందే అంటూ ఎన్నికల సమయంలో జోరుగా ప్రచారం చేసిన నరేంద్ర మోడీ ఆ దిశగా తొలి అడుగు వేశారు. విదేశాల్లోని నల్లధనాన్ని స్వదేశం తీసుకురావడం కోసం జస్టిస్ ఎంబి షా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. దీంతో దేశాన్ని పట్టి పీడిస్తున్న నల్లధనాన్ని విదేశాలనుంచి రప్పించడానికి కృషి ప్రారంభించినట్లైంది. బ్లాక్ మనీ.. భారత దేశం సగం సర్వనాశనం కావడానికి కారణం నల్ల ధనమే. ఒకరా ఇద్దరా లక్షల మంది నల్లధనాన్ని బార్డర్ దాటించేస్తూ అపార కుబేరులైపోతుంటే.. ఇక్కడ దేశం మాత్రం పాతాళానికి దిగిపోతుంది. వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, క్రీడాకారులు, సినిమా తారలు ఇలా ఒక్కరేమిటి అందరికీ ఈ నల్లధనంలో వాటా ఉన్న సంగతి బహిరంగ రహస్యం. వాడూ వీడూ అనే తేడా లేకుండా దీనిని ఓ స్టేటస్ గా కూడా భావించే స్థాయికి చేరిన భారతావని నుండి వెళ్తున్న నల్లధనం వెనుక ఉన్న కొన్ని నిజాలు బయటపడితే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. 84 లక్షల కోట్ల రూపాయలు.. అక్షరాలా 84 లక్షల కోట్లు.. స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న మన దేశానికి చెందిన నల్లధనం. విదేశాల్లో దాచిన బ్లాక్ మనీని తిరిగి తెచ్చే చర్యలు ఎక్కడ వరకు వస్తాయో తెలియదు కానీ స్వదేశం నుంచి బయటకు వెళ్తున్న నల్లధనం లెక్కలు చూస్తే మాత్రం కళ్లు తిరగక తప్పదు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ లెక్కల ప్రకారం- ఒక్క 2011 సంవత్సరంలోనే 4 లక్షల కోట్ల రూపాయల నల్లధనం భారత్ నుంచి బయటకు వెళ్లింది. అంటే 2011లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ 13 లక్షల కోట్ల రూపాయలైతే అందులో మూడో వంతు నల్లధనం సృష్టి జరిగిందన్న మాట. ఇక బ్లాక్ మనీని బార్డర్ దాటిస్తోన్న దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉంది. దేశాన్ని దోచుకు తింటున్నారని చెప్పడానికి ఈ లెక్కలు చిన్న ఉదాహరణ మాత్రమే. 2002 నుంచి 2011 వరకు భారత్ నుంచి బయటకు వెళ్లిన నల్లధనం 15.7 లక్షల కోట్ల వరకు ఉంటుందని గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ అంచనా వేసింది. ఆ సంస్థ వేసిన లెక్కల ప్రకారం ఏటా సగటున 1.6 లక్షల కోట్ల రూపాయల నల్లధనం భారత్ నుంచి బయటకు వెళ్లిపోతున్నదన్న మాట. ఈ లెక్కన దేశంలో ప్రతి ఏటా ఎంత సంపదను అక్రమార్కులు కొల్లగొడుతున్నారో అంచనా వేసుకోవచ్చు. అయితే గత యూపీఏ ప్రభుత్వం మాత్రం విదేశాల్లో దాచిన నల్లధనాన్ని తిరిగి తెచ్చేందుకు నానా కష్టాలు పడుతున్నామని చెప్పుకోడానికే పరిమితమైంది తప్ప ఎలాంటి చర్యలు తీసుకోడానికి చోరవ తీసుకోలేకపోయింది. 2011లో వికీలీక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. టూజీ స్కామ్ తో ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరా రాడియా పేరిట 2 లక్షల 89 వేల 990 కోట్ల రూపాయలు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరిట లక్షా 98 వేల కోట్లు, నరేష్ గోయల్ పేరిట లక్షా 45 వేల 600 కోట్లు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పేరిట 35 వేల కోట్లు, ఆయన కొడుకు స్టాలిన్ పేరిట 10 వేల 500 కోట్లు ఆయన మనవడు కళానిధి మారన్ పేరిట 15 వేల కోట్లు కేంద్ర మాజీ మంత్రి రాజా పేరిట 7 వేల 800 కోట్లు, కేంద్ర మాజీ ఆర్ధికమంత్రి చిదంబరం పేరిట 32 వేల కోట్లు, మరో తాజా మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ పేరిట 28 వేల కోట్లు ఉన్నాయ్. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదంతా పెద్ద జాబితానే. అలాగే కొన్ని ట్రస్ట్ ల పేరిట భారీ మొత్తాలే ఉన్నాయ్. రాజ్ ఫౌండేషన్ పేరిట లక్షా 89 వేల 008 కోట్లు, రెండ్జ్ స్పోర్ట్స్ వర్డ్ పేరిట 29 వేల 800 కోట్లు, ఊర్వశి ఫౌండేషన్ పేరిట 2 లక్షల 89 వేల 745 కోట్లు ఉన్నాయ్. కఠినమైన చట్టాలను అమలు చేస్తున్నామని.. అన్ని చోట్లా నిఘా పెట్టామని చెప్పుకునే ప్రభుత్వాలు భారత్లో యథేచ్ఛగా నల్లధనం సృష్టి.. అది దేశం దాటి విశృంఖలంగా బయటకు వెళ్లడాన్ని మాత్రం పసిగట్టలేకపోవడం విడ్డూరమే. నల్లధనం ఎగుమతి యథేచ్ఛగా జరుగుతుంటే గత ఆర్ధిక మంత్రులు ఏం చర్యలు తీసుకున్నారో ఎవరికీ తెలియదు. పన్ను ఎగవేతదారుల భరతం పడతామని చెప్పడం తప్ప లక్షల కోట్లు తరలిస్తున్న వారి గురించి ఏం చేశారో అడిగితే సమాధానం మాత్రం లభించదు. మన దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ బ్యాంకులు మనీ లాండరింగ్కు పాల్పడుతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గతంలో వెల్లడించారు. దాన్ని బుకాయించడానికి యూపీఏ సర్కార్ లోని కేంద్ర మంత్రులు లైను కట్టారు తప్ప చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించలేదు. గత ఐదేళ్లలో మన దేశంలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు బయటపడ్డాయ్. కామన్వెల్త్ గేమ్స్ నుంచి కోల్గేట్ కుంభకోణం వరకు అన్నీ వేలు, లక్షల కోట్లలో జరిగిన స్కామ్ లే. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం నుంచి అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం వరకు ప్రజాధనం లూటీ జరిగిన మాట వాస్తవం. వీటితో పాటు దేశంలోని సహజ వనరులను కూడా రాజకీయ నాయకులు దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయ్. జార్ఖండ్లో గనుల తవ్వకం, బళ్లారి, ఓబుళాపురంలో అక్రమ మైనింగ్ లాంటివి వీటికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. దేశంలో ఏ మూలన చూసినా సంపద కొల్లగొట్టడమే ధ్యేయంగా సాగుతున్న అక్రమాలు సాక్షాత్కరిస్తున్నాయ్. కుంభకోణాలు, అక్రమ సంపాదన మూలంగా పుట్టుకొస్తున్న నల్లధనం.. గుట్టు చప్పుడు కాకుండా ఎల్లలు దాటుతుంది. ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల ఆర్ధిక మాంద్యం నెలకొని ఉండటంతో భారత్, చైనా, రష్యా, మలేషియా లాంటి దేశాల నుంచి పరుగులు పెడుతున్న నల్లధనానికి బాగా డిమాండ్ ఉందని గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ పేర్కొంది. గత దశాబ్ద కాలంలో రష్యా, చైనా తర్వాత భారత్ నుంచే అత్యధికంగా నల్లధనం బయటకు వెళ్లింది. రష్యా నుంచి 191.14 బిలియన్ డాలర్లు దేశం దాటితే.. చైనా కు సంబంధించిన 151.35 బిలియన్ డాలర్లు విదేశీ బ్యాంక్ లో మూలుగుతున్నాయ్. ఆ తర్వాతి స్థానంలో అంటే మూడో స్థానంలో ఉన్న మన దేశం నుంచి 84.93 బిలియన్ అమెరికన్ డాలర్ల నల్లధనం విదేశాలకు తరలివెళ్లింది. ఏటా భారత్ నుంచి సగటున బయటకు వెళ్తున్న నల్లధనం మన దేశంలో వైద్య- ఆరోగ్య రంగానికి ఖర్చు చేసే నిధులతో పోలిస్తే 14 రెట్లు అధికం. భారత్ కు చెందిన సుమారు కొన్ని లక్షల కోట్ల రూపాయల ధనం స్విస్ బ్యాంకుల్లో ఉందనే లెక్కలు కళ్లకు కడుతున్నాయ్. ఈ ధనాన్ని తిరిగి తెచ్చేందుకు దౌత్య పరంగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయ్. అయితే అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ ఈ లోపు దేశ ఆర్ధిక వ్యవస్థకు తీరని లోటు ఏర్పడుతుందనేది కాదనలేని వాస్తవమని నిపుణులు చెబుతున్నారు. చాలా దేశాలు తమ దేశం నుంచి తరలి వెళ్లిన నల్లధనాన్ని తిరిగి తెప్పించుకోవడానికి ఆయా దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయని భారత్ కూడా ఈ దిశగా అడుగులు వేయాలని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు ఉజ్జాయింపుగా లెక్కిస్తేనే 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా నల్లధనం తరలి వెళ్లిందనే జీఎఫ్ ఐ లెక్కలు చూపిస్తుంటే మరి కనిపించకుండా తరలిపోయిన ధనం ఎంతుంటుందో ఊహకు కూడా అందదు. 2009 నుంచి నల్లధనం విదేశాలకు తరలి వెళ్లడం బాగా పెరిగిపోయిందంటూ వస్తోన్న నివేదికలు తీవ్ర ఆందోళన కలిగించేవే. అందుకే ఇప్పుడు మోడీ సర్కార్ తీసుకొన్న నిర్ణయంపై అన్ని వైపుల్నుంచి ఆనందం వ్యక్తం అవుతోంది. వీలైనంత త్వరగా బ్లాక్ మనీని భారత్ కు తెచ్చేందుకు కృషి చేయాలని లేకపోతే తరలివెళ్తున్న నల్లధనం లెక్కలు వేసుకోవడానికి మన కంప్యూటర్లు కూడా సరిపోవంటున్నారు. అందుకే అవినీతి అక్రమాల యూపీఏ శకం అంతరించి కొలువుదీరిన మోడీ సర్కార్ సిట్ ఏర్పాటుకు సై అనడంతో నల్ల ధనాన్ని దేశానికి తిరిగి తెచ్చే కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో పూర్తి చేయాలని దేశ ప్రజ ఎదురుచూస్తోంది. ప్రచారంలో ఉన్నట్లు 84 లక్షల కోట్ల రూపాయలు కాకపోయినా కనీసం యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన 23 వేల కోట్ల రూపాయలనైనా తీసుకురాగలిగితే దేశ భవిష్యత్తే మారిపోతుందన్నది తిరుగులేని నిజం. వచ్చే ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఎన్ని కష్టాలకోర్చి అయినా విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని దుమ్ముదులిపి దేశానికి తీసుకురాగలిగితే మోడీ దేశ చరిత్రలో తిరుగులేని నేతగా మిగిలిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

No comments:

Post a Comment