తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు

తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం 2వ జూన్‌ 2015న ఘనంగా నిర్వహింపబడుతుంది.
- అన్ని కార్యాలయాలపై జాతీయ పతాకావిష్కరణ
- జూన్‌ 2,2015 నుండి జూన్‌ 8, 2015 వరకు రాష్ట్రమంతా వారం రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. రాష్ట్రమంతటా పండుగ వాతావరణం ఉంటుంది.
- జిల్లాకు కోటి రూపాయలకు తక్కువ కాకుండా మొత్తం 20 కోట్ల రూపాయలు కేటాయింపు.
- మండల స్థాయిలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి రూ. 10,116/- పారితోషికంతో సత్కారం
- జిల్లా స్థాయిలో రూ. 50, 116/- పారితోషికంతో సత్కారం
- రాష్ట్ర స్థాయిలో రూ. 1 లక్షా 116/-ల పారితోషికంతో సత్కారం
- గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వారం రోజుల ఉత్సవం నిర్వహింపబడుతూ చివరి రోజు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించబడుతుంది.
- విద్యా సంస్థల్లోని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, పాటల పోటీలు మున్నగునవి జూన్‌ చివరి వారంలో నిర్వహించాలని నిర్ణయం.

No comments:

Post a Comment